న్యూఢిల్లీ: యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెకఫీ ఫౌండర్ జాన్ మెకఫీపై ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసులను యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఫైల్ చేసింది. తనకున్న ట్విటర్ ఫాలోయింగ్‌ను వాడుకుని క్రిప్టోకరెన్సీలను ఆర్టిఫీషియల్‌గా మెకఫీ పెంచారని ఈ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. కొత్త క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసేందుకు స్టార్టప్‌ల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడనే ఆరోపణలను మెకఫీ ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు 13 మిలియన్ డాలర్లను ఆయన సేకరించారని ఈ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. మెకఫీ బాడీగార్డ్ జిమ్మీ గేల్ వాట్సాన్ జూనియర్‌పై కూడా యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కేసులను నమోదు చేసింది. ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలతో కిందటేడాది అక్టోబర్‌లో స్పెయిన్‌లో మెకఫీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వెర్జ్, రెడ్‌కాయిన్, డాగ్‌కాయిన్ వంటి ఏడు క్రిప్టోకరెన్సీలను 2017 –2018 లో ట్విటర్‌లో ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
